రాష్ట్రంలో దొంగలు అధికారంలో ఉన్నారు – అశోక్ గజపతిరాజు

-

ఎన్.టి.ఆర్ వర్ధంతి సందర్భంగా విజయనగరం కోట వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ యుగపురుషుడని.. ఆయన రాష్ట్రం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. మన రాష్ట్రం సంస్కృతి , సంప్రదాయలును ఇనుమడింపజేశారని అన్నారు.

మహిళలు కి సమాన అవకాశాలు కల్పించారని, వెనుకబడిన వర్గాలుకు పెద్దపీట వేశారని, రాష్ట్రంలో సంక్షేమం తీసుకొచ్చారని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగన్నీ మర్చిపోయారని ఆరోపించారు. మన భవిష్యత్ మొత్తం అంధకారం ఐపోయిందన్నారు అశోక్ గజపతిరాజు. అభివృద్ధి నమమాత్రం అయిన కనబడడం లేదన్నారు. ఉద్యోగాల కోసం ఈ రాష్ట్రం నుండి పక్క రాష్ట్రలుకి పారిపోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో మంత్రులకి విలువ లేదన్నారు.

రాజ్యాంగ వ్యతిరేక పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆరోపించారు. అప్పులు చేసి ప్రజల భవిష్యత్ తాకట్టు పెట్టేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో దొంగలు అధికారంలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత పర్యటనలు అడ్డుకోవాలి అని అడ్డగోలు జి.ఓ.లు తెస్తున్నారని మండిపడ్డారు. వాటిని హైకోర్టు కొట్టేసిన బుద్ధి రావడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news