‘యువగళం’ కాదు.. అది టీడీపీకి ‘మంగళం’ పాడే యాత్ర: రోజా

-

వడమాల పేట మండలం వనమాల గ్రామంలో జీజీపీ ఫండ్స్ ద్వారా ఐదు లక్షల రూపాయలు మరియు ఎమ్మెల్యే ఫండ్స్ 10 లక్షల రూపాయల 15 లక్షల అంచనా వ్యాయామంతో.. నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను ఆదివారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్రపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. లోకేశ్ ఎందుకు పాదయాత్ర చేయాలనుకుంటున్నారో ఆయనకే క్లారిటీ లేదన్నారు. లోకేశ్‌ వార్డు మెంబర్‌కు ఎక్కువ.. MLAకి చాలా తక్కువ అని ఎద్దేవా చేశారు మంత్రి రోజా.

లోకేశ్ ‘యువగళం’ కాదని.. టీడీపీకి ‘మంగళం’ పాడే యాత్ర అని మంత్రి రోజా విమర్శించారు. ఆయన అడుగుపెట్టిన ప్రతిచోట టీడీపీ ఓడిపోయిందని.. భవిష్యత్తులోనూ అదే జరుగుతుందన్నారు మంత్రి రోజా. చంద్రబాబు కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచారని రోజా ఆరోపించారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక దొంగ ఓట్లు తీసేయడంతో పరిస్థితి మారిపోయిందన్నారు మంత్రి రోజా. లోకేష్ యువగళం పాదయాత్రకు భద్రత ఇవ్వాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు మంత్రి రోజా. చంద్రబాబు హాయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆయన లెక్కలతో వస్తే చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news