ఇదేం విడ్డూరం.. అక్కడ గడియారాలు కడితే కోరిక్కేలు వెంటనే తీరతాయట..

-

మన దేశంలో దేవుడ్లకు ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే హిందువులు పవిత్రంగా పూజలు చేస్తారు.. అయితే గుడికి వెళ్లిన వారు కొంతమంది వారి కోరికలను దేవుడికి చెప్పి ముడుపులు కడతారు..మన తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరికాయలు లేదా ఏదైనా వస్తువుతో ముడుపులు కడతారు కానీ ఓ ఆలయం లో మాత్రం ముడుపులుగా గోడ గడియారాన్ని కడతారట.. ఎందుకు అలా కడతారు.. ఏదైనా చరిత్ర ఉందా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లా లో అన్హెల్ రోడ్డు పక్కన సాగస్‌ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయం ఉంది.ఆ ఆలయం ముందు పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. స్థానికులు పెద్ద ఎత్తైన ఆ మర్రి చెట్టు కొమ్మలకు గోడ గడియారాలు కడుతూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా ఆ బాబాని స్థానికులు పూజిస్తూ ఉంటారు.

కోరిన కోరికలు తీరిన వారు వచ్చి బాబా గుడిలో గడియారాలను చెట్టుకు కట్టేసి వెళతారు. ప్రస్తుతం ఆ చెట్టుకు దాదాపుగా 2000 గడియారాలు ఉంటాయి. గతంలో ఒక భక్తుడు తమ కోరిన కోరిక తీరితే తమ ఇంట్లోనే అత్యంత ఖరీదైన గడియారాన్ని ముడుపుగా ఇస్తానంటూ మొక్కుకున్నాడు.ఆయన కోరిన కోరిక తీరడంతో గడియారాన్ని ముడుపుగా ఇవ్వడం జరిగిందట. అప్పటి నుంచి కూడా ఆయన కుటుంబీకులు మరియు ఆయన చుట్టు పక్కల వారు ఆలయంలోని మర్రి చెట్టుకు గోడ గడియారాలను ఇవ్వడం జరుగుతుంది. వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజం.. ఎవరి నమ్మకం వారిది కదా..

Read more RELATED
Recommended to you

Latest news