యంగ్ హీరోయిన్ కి తల్లిగా కాజల్ అగర్వాల్..!

-

చందమామ ఫేమ్ కాజల్ అగర్వాల్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారి పెద్ద పెద్ద హీరోల సరసన నటించి.. అతి తక్కువ సమయంలోనే తన కెరియర్ గ్రాఫ్ ను పెంచేసుకుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన అందంతో నటనతో గూడు కట్టుకున్న ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించింది . ఇకపోతే 2021 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్ లుని ఈమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏప్రిల్ 19వ తేదీ గత ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది . ఇన్ని రోజులపాటు కుటుంబంతోనే గడిపిన ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతుందని సమాచారం.

అందుకు తగ్గట్టుగానే సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇప్పటికే కమలహాసన్ నటించిన ఇండియన్ 2 సినిమాలో అవకాశం దక్కించుకున్న ఈమె ఇప్పుడు మరో కుర్ర హీరోయిన్ కి తల్లిగా నటించబోతున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటిస్తున్న ఎన్బికె 108 చిత్రం కోసం కాజల్ అగర్వాల్ చిత్ర బృందంను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాకు ఇంకా సంతకం చేయలేదట. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి సక్సెస్ పొందాలనుకుంటున్న కాజల్ ఈ సినిమాలో నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇందులో కుర్ర హీరోయిన్ శ్రీ లీలాకి తల్లి పాత్రలోనే కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. ఒకవేళ ఈ ముంబై ముద్దుగుమ్మ ఈ సినిమాకు సైన్ చేసిందంటే ఇక శ్రీలీలా తల్లిపాత్రలో కనిపిస్తుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news