ఫ్రీ క్రెడిట్ కార్డు.. రూ.20 లక్షల బెనిఫిట్..!

క్రెడిట్ కార్డు ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ కార్డు గురించి చూడాల్సిందే. ఈ క్రెడిట్ కార్డు ని ఫ్రీగానే పొందొచ్చు. ఉచితంగా బీమా కవరేజ్ కూడా లభిస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కొత్త క్రెడిట్ కార్డు ని తీసుకు రావడం జరిగింది.

దీనితో ఆ కార్డు ప్రయోజనాలని మీరు పొందొచ్చు. అయితే ఈ కార్డు అందరికీ రాదు. కేవలం కొంత మందికి మాత్రమే ఇది వస్తుంది. ఇండియన్ డిఫెన్స్‌, పారామిలిటీర, పోలీస్ సిబ్బంది భాగస్వామ్యం ద్వారా ఈ క్రెడిట్ కార్డు ని ఇస్తున్నారు. విక్రమ్ క్రెడిట్ కార్డు దీని పేరు. దేశం కోసం సేవలు అందిస్తున్న వాళ్లకి
ఈ క్రెడిట్ కార్డును తీసుకు వచ్చింది బ్యాంక్. ఇండియన్ ఆర్మీ , ఇండియన్ నావీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, అస్పాం రైఫిల్స్‌తో బ్యాంక్ ఎక్స్‌క్లూజివ్ డీల్స్ కలిగుంది.

74వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కొత్త ఎక్స్‌క్లూజివ్ క్రెడిట్ కార్డులను ఇస్తున్నారు. లైఫ్ టైమ్ ఫ్రీ ఇది. ఎలాంటి జాయినింగ్, రెన్యూవల్, వార్షిక చార్జీలు కూడా పడవు. ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. ప్రమాద బీమా రూ. 20 లక్షలు. ఫ్యూయెల్ సర్‌చార్జ్ మాఫీ బెనిఫిట్ కూడా ఉంది. ఎల్‌టీఎఫ్ యాడ్ఆన్స్ కూడా దీనిలో ఉంటాయి. ఈఎంఐ ఆఫర్లు కూడా వున్నాయి. మర్చంట్ ఆఫర్లు కూడా పొందొచ్చు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ క్రెడిట్ కార్డును తీసుకు వస్తున్నారు.