ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువ అయిపోయింది. ప్రతి అవసరానికి ఫోన్ తప్పని సరిగా ఉండాల్సిందే. అయితే ఫోన్‌లో ఛార్జింగ్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమైనది. ప్రయాణాల్లో ఫోన్ ఛార్జింగ్ చాలా అవసరం. వాస్తవానికి బ్యాటరీ కెపాసిటీ ఎంత ముఖ్యమో.. అది ఎంత తొందరగా ఛార్జ్ అవుతుందన్నది కూడా అంతే ముఖ్యం. ఎక్కడికైనా బయటికి గానీ, ఊళ్లకు గానీ వెళ్లినప్పుడు ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే చిరెత్తుకొచ్చేస్తుంది.
ఈ సమస్యలకు చెక్ పెడుతూ బ్యాటరీ ఇబ్బందులు లేకుండా వివో ఈ నెలలో లాంచ్ చేసే జడ్1 ఎక్స్ ఫోన్‌లో చాలా ప్రత్యేకతలతో వస్తోంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది అంత గొప్ప కాకపోవచ్చు. కానీ దీని స్పెషాలిటీ 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. ఫోన్‌లో మూడు గంటల పాటు మాట్లాడుకోవచ్చు. అయితే మరి ఫోన్ ఛార్జ్ అయింది కదా అని యూట్యూబ్‌లో వీడియోలు చూసేసి మళ్లీ అరగంటలోనే జీరోకి వచ్చేస్తే మాత్రం వాళ్ల బాధ్యత లేదు. ఇక దీని ధర రూ. 16 వేల నుంచి ప్రారంభం అవుతుంది.
ఈ నెల 6వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నారు. సమాచారం ప్రకారం… ఆండ్రాయిడ్ పై ఓఎస్, 6.38 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 ఎస్‌ఓసీ, 6 జీబీ ర్యామ్, 64 జీబీ/128 జీబీ స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. 48 మెగాపిక్సల్‌తో కూడిన రియర్ ట్రిపుల్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉన్నాయి.