I LOVE U నాగచైతన్య : టాలీవుడ్ హీరోయిన్

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం నుంచి..నాగ చైతన్య వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. కథ మరియు కథాంశంలో చాలా భిన్నంగా నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తూ… ముందుకు సాగుతున్నారు. ఇందులో ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య కస్టడీ సినిమా చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా, కొన్ని రోజులుగా నాగ చైతన్య, దివ్యంశ కౌశిక్ మధ్య ఎఫైర్‌ ఉందని వార్తులు వచ్చాయి. అయితే, తాజాగా నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి వార్తలపై మజిలీ బ్యూటీ దివ్యంశ కౌశిక్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఐ లవ్ నాగచైతన్య. అతనిపై క్రష్ ఉంది. చాలా అందంగా ఉంటాడు. అయితే అతన్ని నా సీనియర్ నటుడి గానే చూస్తాను. అతనితో పెళ్లి అనే పుకార్లను నేను వినలేదు. మా బిజీలో మేమున్నాం. అలాగే రామారావు ఆన్ డ్యూటీ మూవీలో నాకు ఛాన్స్ రావడానికి కారణం చైతూనే అనే రూమర్స్ లోను నిజం లేదు’ అని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news