పవన్ కళ్యాణ్ , సుజిత్ మూవీ రేపే ప్రారంభం.!

-

పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.తన ఫైట్స్, యాక్టింగ్, స్టైల్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని రోజులు రాజకీయాలలో కొన్ని రోజులు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్  ”హరిహర వీరమల్లు”. ఈ సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత ఇక పవన్ కల్యాణ్ సాహొ డైరెక్టర్ సుజిత్ తో ఒక సినిమా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే.సుజిత్ సినిమా  పాన్ ఇండియా టార్గెట్ గా జపాన్, ఇండియా మధ్య నడిచే గాంగాస్టర్ పాత్ర నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఉండబోతుందట. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక గట్టి రూమర్ ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం ఈ సినిమా లో ఫైట్స్, పాటలు ఉండవని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా కు డివివి దానయ్య నిర్మాతగా వ్యవరిస్తున్నారు.ఇక ఈ సినిమా రేపు అధికారికంగా పూజ కార్యక్రమాలు చేసి ప్రారంభం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ సినిమా కోసం డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ పక్కాగా పూర్తి చేసుకొని రెడీగా ఉన్నట్లు, స్క్రిప్ట్ కూడా సూపర్ గా వచ్చిందని పవన్ కల్యాణ్ స్టయిల్ కు సరిపోయే విధంగా చూపిస్తారని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news