BREAKING : చరిత్ర సృష్టించిన అండర్‌-19 మహిళ క్రికెట్‌ జట్టు.. వరల్డ్‌ కప్‌ కొట్టేశారు

-

ఐసీసీ అండర్ 19 మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బంతులు వేసి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ ను బెంబేలేత్తించింది. నియామ్ ఫియోనా హాలండ్ (10), ర్యానా మక్డోనాల్డ్ (19), సోఫియా స్మేల్ (10), అలెక్సా స్టోన్‌హౌస్(11) మినహా మిగితా బ్యాట్స్ మెన్స్ అంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో టిటాస్ సాధు, అర్చన దేవి, పార్షవి చోప్రా తలో రెండు వికెట్లు తీశారు. అయితే అనంతరం 69 పరుగుల లక్ష్యఛేదనకు దిగి భారత్‌ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం. దీంతో తొలిసారి ఇండియా ఉమెన్స్‌ క్రికెట్‌ ఖాతాలో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది.

ఐసీసీ నిర్వహిస్తున్న అండర్-19 మహిళల టీ20 మొదటి ప్రపంచ కప్‌ గెలుచుకున్న దేశంగా టీమిండియా నిలిచింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. 17.1 ఓవర్లలో, 68 పరుగులు మాత్రమే ఇచ్చి ఆలౌట్ చేశారు. ఆ జట్టులో అత్యధిక స్కోరు 19. ఓపెనర్, కెప్టెన్ అయిన గ్రేస్ స్రివెన్స్ 4 పరుగులకు ఔట్ కాగా, మరో ఓపెనర్ లిబర్టీ హీప్ డకౌట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news