చాలా మంది వారి భవిష్యత్తు లో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తూ వుంటారు. అయితే ప్రతీ ఒక్కరు కూడా జీవిత బీమా కి ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు అనువైన పాలసీని ఎంచుకుంటే భవిష్యత్తును బాగా ఉంచచ్చు. ఎక్కువ రిస్క్ కవరేజి అది కూడా తక్కువ ప్రీమియం తో మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల తో పొందొచ్చు. ఇక వీటి కోసం పూర్తి వివరాలని చూసేద్దాం.
సింగిల్ ప్రీమియం ప్లాన్:
దీన్ని ఎంచుకుంటే ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రీమియం కట్టాలి. పేమెంట్స్‌పై శ్రద్ధ లేని వారికి సింగల్ ప్రీమియం టర్మ్ ప్లాన్స్ సరిపోతాయి. పైగా టైం కి పే చెయ్యాలన్న టెన్షన్ కూడా ఉండదు.
పరిమిత చెల్లింపు వ్యవధి:
టర్మ్ పాలసీలు సింగిల్ ప్రీమియం పాలసీలకు భిన్నంగా ఉంటాయి. మీరు వీటిలో పెద్ద మొత్తంలో ఒక సారి చెల్లించకుండా 5-10 ఏళ్ల పాటు చెల్లించేలా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ప్రీమియం చెల్లింపు వ్యవధి క్లోజ్ అయినా బీమా కవరేజీ ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్స్ తో కనుక పోల్చితే ప్రీమియం కాస్త ఎక్కువగా ఉంటుంది. మొదట మీరు ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే ఇది బెస్ట్.
ప్రీమియం వాపసు వస్తుంది:
టర్మ్ ప్లాన్ వలన డబ్బులు వేస్ట్ అనుకుంటే సంస్థలు అందించే ఇలాంటి పాలసీను పొందొచ్చు. మీ బీమా గడువు అయ్యాక ప్రీమియం తిరిగి ఇచ్చేస్తుంటాయి.
నెలవారీ ఆదాయం:
నెల నెలా మీరు కొంచెం ఆదాయం అందాలని అనుకుంటే కనుక 10-15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లింపులు ఉంటాయి. 10-15 వరకు నెల నెల కొంత ఇస్తాయి. కొన్ని ప్లాన్స్ అయితే ద్రవ్యోల్బణం ఆధారంగా పేమెంట్స్ ని 10 శాతం వరకు పెంచి చెల్లించే విధంగా ఉంటాయి.