ధర్మం కోసం చావడానికైనా సిద్ధమంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న ముంబయి ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నోటీసులు జారీ చేసినట్లు మంగళ్‌హాట్ పోలీసులు తెలిపారు. ఆ ర్యాలీలో రాజాసింగ్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
హైకోర్టు షరతులు ఉల్లంఘించినందునే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. వీటిపై రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పారు. అయి తే, దీనిపై రాజాసింగ్ స్పందించారు. రెండు సార్లు ఎమ్మేల్యే అయినా ..ఇక ధర్మం కోసం చావడానికైనా సిద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులిచ్చినా, జైలుకు పంపినా ,రాష్ట్ర బహిష్కరించిన భయపడేది లేదని…గోహత్య, మతమార్పిడులు, లవ్ జిహాదైపై చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరడం మతవిద్వేషాలు రెచ్చగొట్టడమా అని ప్రశ్నించారు. ముంబై లో మాట్లాడితే ఇక్కడి పోలీసులు నోటీసులిచ్చారని మండిపడ్డారు.