2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై ఆమె ప్రసంగిస్తున్నారు.
‘తాజా బడ్జెట్లో రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు చేస్తున్నాం. రైల్వేల అభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.2.04లక్షల కోట్లు కేటాయిస్తున్నాం. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తాం. అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి 33శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నాం. మూలధనం కింద రూ.10లక్షల కోట్లు కేటాయిస్తున్నాం.’ అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.