శ్రీ రెడ్డి లో మనం చూడని మరో కోణం కూడా ఉందా.!

-

ఈ సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదును వున్న కత్తిలా తయారైంది. చాలా మంది దీనిని ఉపయోగించి కొత్త కెరియర్ స్టార్ట్ చేసి ఉన్నత స్థానంలో నిలిచారు. ఒకప్పుడు సామాన్య ప్రజలకు తన మనసులోని భావనను చెప్పుకోవడానికి సరైన వేదిక ఉండేది కాదు. టీవి ఛానెల్ లు, పేపర్స్ బడా బాబుల చేతుల్లో ఉండేవి. దీనితో సామాన్య జనం దిక్కు తోచని స్థితిలో ఉండేవారు. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మాత్రమే వారి గొంతుకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియాను కొంత మంది విషం కక్కడానికి ఉపయోగిస్తున్నారు.

ఇక మన కాంట్రవర్సీ  క్వీన్ అక్క శ్రీ రెడ్డి దీనిని ఎప్పుడూ విమర్శలు చేయడానికే ఉపయోగిస్తూ తనను తాను మరింత దిగజారేలా చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక లేస్తే పవన్ కళ్యాణ్ ను, చిరంజీవి ను తిట్టడమే పనిగా పెట్టుకుంది. ఇక తాజాగా ఆమె మహిళల, పిల్లల పక్షపాతి గా మాట్లాడుతూ అయోమయం కు గురి చేస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ భార్యను తిట్టిన వాడిపై విరుచుకు పడింది.

వైసీపీ పార్టీ గా చెప్పుకుంటున్న బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యక్తి పై ఇటీవల పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.పవన్ భార్య, పిల్లలను తనకు అప్పగించాలని అనిల్ కామెంట్స్ చేసాడు.. ఈ వీడియో పై శ్రీ రెడ్డి ఘాటుగా స్పందించింది. వైసీపీ ఉన్న అభిమానంతో మనమంతా జగనన్నను నమ్మిన వాళ్లము. ఒక వెధవ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం గురించి తప్పుగా మాట్లాడాడు.పవన్‌ను తిట్టు తప్పులేదు. కానీ ఆయన భార్య పిల్లలను అనిల్ కుమార్ అనే దరిద్రుడు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల జోలికి వస్తే తాటతీస్తానంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది. అనిల్ లాంటి రౌడీ వెధవలను జగనన్న ఎంకరేజ్ చేయడం సరికాదని. తన దైన శైలిలో రెచ్చిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news