ఒకే ఫ్రేమ్ లో MS ధోనీ, గంగూలీ..ఫోటోలు వైరల్

-

ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియాలో ఎన్నో విజయాలు అందించి చరిత్ర సృష్టించాడు ధోని. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు టోర్నీలు అందించిన కెప్టెన్ గా నిలిచాడు. ఇక ధోని హెలికాప్టర్ షాట్… ఆయన కెరీర్ లోనే ద బెస్ట్.

అయితే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోని మరియు సౌరవ్ గంగూలీలు ఒకే ఫ్రెమ్‌ లో ఉన్న ఫోటో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ధోని ఫార్మల్ లుక్ లో ఎంతో క్లాస్ గా మరియు హ్యాండ్సమ్ గా ఉన్నాడని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ముంబైలోని ఫిలిం సిటీ లో వీరిద్దరూ అడ్వర్టైజ్మెంట్ షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం అందిస్తుంది. ఒకే బిల్డింగ్ లో వివిధ ఫోర్లలో వీరి షూటింగ్ జరగ్గా, ఇది తెలుసుకొని, బ్రేక్ టైం లో కలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news