అంకుర సంస్థల ఏర్పాటులో తెలంగాణకు 8వ స్థానం

-

స్టార్టప్‌ల ఏర్పాటులో తెలంగాణ 8వ స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్‌ బిహార్‌కంటే దిగువస్థాయిలో నిలిచింది. 2022 డిసెంబరు 31 నాటికి దేశవ్యాప్తంగా 86,713 స్టార్టప్‌లు ఏర్పాటవగా వాటిలో 1,341 అంకురాలతో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానానికి పరిమితమైంది. 4,566 స్టార్టప్‌లతో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తొలి అయిదు స్థానాలను మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ ఆక్రమించాయి. దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.

కేంద్రం ప్రకటించిన స్టేట్స్‌ స్టార్టప్స్‌ ర్యాంకింగ్‌ ఎక్సైజ్‌-2022లో తెలంగాణ టాప్‌ పెర్ఫార్మర్‌గా 7వ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌ 29వ స్థానానికి పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 16న స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2019 ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌లోని అర్హతల ప్రకారం ఏర్పాటైన వాటిని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ట్రేడ్‌ (డీపీఐఐటీ) స్టార్టప్‌లుగా గుర్తిస్తూ వస్తున్నారు.

అలా గుర్తింపు పొందిన 86,713 స్టార్టప్‌లలో ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానంలో నిలిచింది. ఏపీ తర్వాతి స్థానంలో ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, ఝార్ఖండ్‌తోపాటు ఈశాన్యరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news