30 రూపాయిలకే వాటర్‌ ఫిల్టర్‌!!

-

అయితే సామాన్యుడికి ఆ నీరు అందని ద్రాక్షగానే మిగిలింది. ఫిల్టర్‌లు కొనాలంటే వేయిల రూపాయిలు.. అంతేకాదు వాటి మెయింటెనెన్స్‌ ఇలా రకరకాల ఇబ్బందులు. వీటన్నింటికి చెక్‌పెడుతూ కర్నాటకకు చెందిన 22 ఏళ్ల మెకానికల్‌ ఇంజనీర్‌ నిరంజన్‌ కరాగి దీన్ని తయారుచేశాడు.

అత్యంత తక్కువ ధరలో కేవలం 30 రూపాయల వ్యయంతో ఎక్కడికంటే అక్కడికి జేబులో తీసుకుపోయేటంతటి వాటర్‌ ఫిల్టర్‌ను రూపొందించాడు. ఆ విశేషాలు తెలుసుకుందాం… మామూలు క్యాప్‌లా వుండే ఈ చిన్న పరికరం ‘ప్యూరిట్‌ ఇన్‌ పాకెట్‌’. దీని ద్వారా ఎంత మురికిగా ఉన్న నీటినైనా క్షణాల్లో పరిశుభ్రంగా మార్చుకోవచ్చు. మనం వినియోగించే అతి చిన్న వాటర్‌ బాటిల్స్‌కు దీన్ని వాడుకోవచ్చు.

ఎందుకు కనిపెట్టాడో తెలుసా?
కర్ణాటక బెల్గాంలోని ఒక ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న స్టేడియంలో ఆడటానికి వెళ్ళాడు, అక్కడ విద్యార్థులు ట్యాప్‌ నుండి అపరిశుభ్రమైన నీరు తాగడం చూసి కలత చెందాడు. మరుసటి రోజు సాయంత్రం మార్కెట్లో వాటర్‌ ఫిల్టర్ల రేట్లను పరిశీలించాడు. వాటి ఖరీదు అతనిని బాధ మరింత రెట్టింపైంది. దీంతో పరిష్కారం వైపు దృష్టి సారించాడు. ఆ ఆలోచన కొత్త ఆవిష్కారానికి బీజం వేసింది. కొన్ని రోజుల నిరంతర శ్రమ తరువాత 100 లీటర్ల నీటిని శుభ్రంచేసే చిన్న వడపోత యంత్రాన్ని రూపొందించాడు. దాన్ని తన ప్రొఫెసర్లకు చూపించాడు, కాని అది చాలా చిన్న ప్రాజెక్ట్‌ కావడంతో వారు దానిపై ఆసక్తి చూపలేదు.

అయినా ఎక్కడా నిరాశ చెందకుండా పట్టుదలగా ముందుకు కదిలాడు. సరసమైన ధరలో దీనిని పేదలకు అందించే దిశగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. కానీ ఇందుకోసం పెట్టుబడి కావాలి కదా. చివరకు దేశ్‌పాండే ఫౌండేషన్‌ వారి సహకారంతో 2017లో రూ .12,000 పెట్టుబడితో ఈ ట్యాప్‌ లాంటి ఫిల్టర్లను తయారు చేయడం ప్రారంభించాడు. అసలు దీని ప్రారంభ ధర 20 రూపాయలు మాత్రమే. అయితే జీఎస్‌టీ ప్రవేశపెట్టిన తరువాత అతను దానిని రూ .30 కి పెంచాల్సి వచ్చిందట. ప్రధానంగా సోషల్‌ మీడియా ద్వారానే తన పరికరానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని నిరంజన్‌ సంతోషంగా చెబుతారు.

ప్రస్తుతం 2000 లీటర్ల నీటిని శుభ్రపరచగల అధునాతన ఫిల్టర్‌ను అభివృద్ధి చేస్తున్నాననీ, దీనికి రూ.100 -150 రూపాయలు ఖర్చు అవుతుందని నిరంజన్‌ తెలిపారు. అలాగే మార్కెట్‌లో లభించే ఖరీదైన ఫిల్టర్లతో పోలిస్తే తన నిర్‌నల్‌ భారతదేశంలో అత్యంత సురక్షితమైన, శుభ్రమైన తాగునీటిని అందిస్తుందని, 95 శాతం బ్యాక్టీరియాను నిర్మూలిస్తుందని హామీ ఇస్తున్నారు.

A 30 Rs portable water filter. pic.twitter.com/8L01UrCbJ5

— Aggressive Indian (@bharat_builder) September 9, 2019

Read more RELATED
Recommended to you

Latest news