మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వీడియో విడుదలైంది. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలైన ఆంథమ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దశకంఠ లంకాపతి రావణా.. అంటూ సాగే ఈ పాటను హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా.. శాంతి పీపుల్, నోవ్లిక్ పాడారు.

రావణాసుర సినిమాలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ సుశాంత్ విలన్గా నటిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ఈ మూవీకి హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.