NTR 30: వందల సార్లు అడిగితే కోపం రాదా మరి..!

-

జూ ఎన్టీఆర్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.  రాజ మౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో తన నటన తో  భారత దేశంలో లోనే కాక ,హాలీవుడ్ వాళ్ళను సైతం ఆశ్చర్యపరిచాడు.కాని జూ ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి అప్డేట్ లేక ఫ్యాన్స్ చాలా నిరుస్తాహం గా వున్నారు. తాను చేయబోయే చిత్రం 30 వది కావడంతో నందమూరి అభిమానులే కాదు, టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు చూస్తున్నారు.ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన సెట్‌ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. శంషాబాద్‌లో ప్రాంతంలో ఓ సెట్‌ వేస్తున్నారట. అయితే సినిమా షూటింగ్‌ ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందనే టాక్‌ ఆ మధ్య వినిపించింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచిగానీ, లేదంటే మార్చి మొదటి వారం నుంచి గానీ చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉందని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ఇక కల్యాణ్ రామ్ సినిమా  అమిగోస్   ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తెలుగు టాప్ యాంకర్ సుమ పై NTR 30 అప్డేట్స్ కోసం అడగగా జూ ఎన్టీఆర్ కోపంగా చూసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాని ఏ ఈవెంట్ అయినా కూడా నవ్వుతూ, చిల్ అవుతూ, పక్క వాళ్ళను గిచ్చుతూ హ్యాపీగా ఉండే జూ ఎన్టీఆర్ లో ఇలాంటి కోణం ఎవరూ ఊహించలేదు, ఆకరికి ఎంతో అనుభవం ఉన్న సుమ కూడా. కాని దీని వెనకాల ఇరిటేట్ అయ్యే సన్నివేశాలు చాలా జరిగాయట. జూ ఎన్టీఆర్ ఎక్కడకి వెళ్ళినా ఇదే గోల, ఫోన్ ఆన్ చేసినా ఇదే గోల, ఇంటర్వ్యూ లో కూడా ఇదే గోల, ఇప్పటికే వందల సార్లు ఈ ప్రశ్న వినీ విని ప్రస్టేషన్ తో కోపం వచ్చింది అని సన్నిహితులు అంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news