సార్ మూవీ తో పేరును కూడా మార్చుకున్న భీమ్లా నాయక్ ముద్దుగుమ్మ..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా స్క్రీన్ షేర్ చేసుకున్న మొదటి చిత్రం భీమ్లా నాయక్ . ఈ సినిమాలో రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటించి అలరించింది. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ బ్లాక్ బాస్టర్ మూవీ బింబిసారా లో ఎస్సై వైజయంతి పాత్రలో కూడా కనిపించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. త్వరలో రానున్న ధనుష్ సార్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పుడు ఒక బోల్డ్ డెసిషన్ ద్వారా సంయుక్త చిత్రసీమ వర్గాలలో హాట్ టాపిక్ గా నిలిచింది. అసలు విషయంలోకి వెళితే తన పేరు చివర ఉన్న తోకను కూడా ఆమె కత్తిరించారు..

తన పేరు సంయుక్త మీనన్ కాదు అని జస్ట్ సంయుక్త అని ఈ అందాల భామ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా తన పేరు చివరన మీనన్ ను తొలగించారు. అయితే ఇందుకు గల కారణం ఏమిటి అంటే ..? నా పేరులో నుంచి మీనన్ తీసేయాలనే ఆలోచన చాలా రోజుల క్రితమే వచ్చింది. పేరు చివర తోకలు ఎందుకు తగిలించుకుంటారు అనేది నాకు అర్థం కాదు… నటి అయ్యాక నాలో ఈ ఆలోచన మరింత పెరిగింది అందుకే కథానాయకగా నాకంటూ బాధ్యత ఉంటుంది.. కాబట్టి ఇంటిపేరు ఉండకూడదని తీసేసా అని సంయుక్త తెలిపింది..

నిజానికి మీనన్ అనేది కేరళలోని నాయర్ కమ్యూనిటీకి చెందింది. తన పేరు చివర కులం ఉండకూడదని సంయుక్త ఆలోచించడం వల్లే ఇలా మీనన్ ను తొలగించినట్లు తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే ఇప్పటికే సంయుక్త తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. తండ్రి ఇంటి పేరు వద్దని అనుకోవడం కూడా మరొక కారణం.. మొత్తానికైతే సంయుక్త తన పేరు చివరన మీనన్ ను కత్తిరించి కమ్యూనిటీ అనే పదానికి పుల్ స్టాప్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news