సొంత చెల్లిని పెళ్లి చేసుకున్న అన్న.. కారణం తెలిస్తే షాకే..!

-

మానవసంబంధాలు మంటకలిసిపోతున్న కాలం ఇది.. చిన్నపిల్లలనే అత్యాచారం చేస్తున్నారు. ఇవే ఒక దారుణం అంటే.. సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నాడు ఓ అన్న. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనతో యావత్‌ దేశం మండిపడుతుంది. ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరిగింది. కానీ దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే..నవ్వాలో, ఏడ్వాలో కూడా తెలియదు.. అసలేం జరిగిందంటే..ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఫిరోజాబాద్​లో సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడు ఓ అన్న. టుండ్ల బ్లాక్​ పరిధిలో సీఎం సామూహిక వివాహల కార్యక్రమం జరిగింది. ఇందులో 51 జంటలు వివాహం చేసుకున్నాయి.
వీరందరికి పెళ్లి ఖర్చులను ప్రభుత్వమే భరించింది. గృహోపకరణాలు, దుస్తులను కూడా కానుకగా ఇచ్చింది. వీటికోసం ఆశపడిన ఓ వ్యక్తి.. తన సొంత చెల్లిని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. అయితే అక్కడి వరకు అంతా బాగనే ఉన్నా.. విషయం బయటకు వచ్చేసింది.
ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో పెళ్లి చేసుకున్న జంటలకు ప్రభుత్వం దగ్గరుండి ఫొటోలు తీయించింది. అయితే ఆ వివాహ ఫొటోలు స్థానికంగా ప్రచారం కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ అన్న, చెల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.
ఈ వ్యవహారంపై వార్తలు రావడంతో వివాహాలు నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. గ్రామస్థాయి అధికారులపై ఫైర్ అయ్యారు. దీనిపై వివరణ ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మొత్తానికి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందడానికి ఏకంగా చెల్లినే పెళ్లి చేసుకున్నాడు ఆ అన్న.
సరే.. ప్రభుత్వం ఇచ్చే వాటి కోసం ఆశపడి చేసుకోవాలి అనుకున్నాడు.. ఏ ఫ్రండ్‌నో, వరస అయ్యే వాళ్లని చూసుకుండి పోయేది.. పోయి పోయి సొంత చెల్లిని ఎలా చేసుకోవాలి అనుకున్నాడో.. ఈ విషయం సోషల్‌ మీడియాలో ఈ వార్త వైరల్‌ అవడంతో.. అందరూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.!

Read more RELATED
Recommended to you

Latest news