పెళ్లి అంటే ఎన్నో సరదాలు, పలకరింపులు ఉంటాయి.. జీవితం లో ఒకసారి చేసుకొనే ఈ పెళ్లిని ప్రతి ఒక్కరు ఉన్నంతలో గ్రాండ్ గా చెయ్యాలని అనుకుంటారు. పెళ్లి కొడుకు ఇంటి దగ్గర బయలు దేరిన నుంచి.. వధువును తీసుకుని ఇంటికి వచ్చే వరకు.. కుటుంబ సభ్యుల హాడావుడి, బరాత్ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పెళ్లి జరుగుతున్నప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు వైరల్ అవుతుంటాయి.
మరి కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.. వరుడు, వధువుల డ్యాన్స్.. కుటుంబసభ్యుల అల్లరి.. ఇలా ఎన్నో వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇవి నెటిజన్లను ఆనందంలో ముంచెత్తుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో లో వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకొనే సమయంలో ఓ వానరం సడెన్ ఎంట్రీ ఇచ్చింది..
ఓ వానరం అకస్మాత్తుగా వధూవరులు ఒకరినొకరు తలపై పెట్టిన జీలకర్ర బెల్లంను ఎత్తుకుని తీసుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి తంతు జరుగుతున్న దృశ్యాలను చూడవచ్చు. వధూవరులిద్దరూ జీలకర్ర బెల్లంను ఒకరినొకరు తలపై పెట్టుకున్నారు. ఈ సమయంలో ఎటునుంచి వచ్చిందో కానీ.. అకస్మాత్తుగా కోతి వరుడి తలపై దూకుతుంది. అనంతరం అమ్మాయి మీద ఉన్న జిలకర్రా బెల్లం కూడా తీసుకొని వెళ్ళింది.. ఇది కాస్త ఫన్నీగా ఉండటంతో ఇప్పుడు వైరల్ అవుతుంది.. మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..