22 ఏళ్ల త‌ర్వాత నీళ్ల‌లో డెడ్ బాడీ ట్రేస్ చేసిన గూగుల్ ఎర్త్‌

-

స్థానిక నైట్ క్లబ్‌లో ఫుల్‌గా డ్రింక్ చేశారు విలియం ఎర్ల్ మోల్డట్ (40). రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అతడి గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది. తాగిన మైకంలోనే ఇంటికి బయల్దేరానంటూ చెప్పాడు. కానీ ఇంటికి రాలేదు. ఏమ‌య్యాడో తెలియ‌దు. అత‌డి మిస్సింగ్ మిస్ట‌రీగానే ఉండిపోయింది. 1997 ఫ్లోరిడాలోని లాంటనా ప్రాంతంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. తాగిన మ‌త్తులో తెల్ల కారులో ఇంటికి బ‌య‌లుదేరిన విలియం అదృశ్యం అయ్యాడు.

విచిత్రం ఏంటంటే ఈ ఘ‌ట‌న జ‌రిగిన 22 ఏళ్ల‌కు ఈ మిస్ట‌రీని చేధించారు. గూగుల్ ఎర్త్ శాటిలైట్ సెర్చ్ చేస్తుండగా 22 ఏళ్ల క్రితం అదృశ్యమైన విలియం మృతదేహం అవశేషాలు, కారు మూన్ బే సర్కిల్ కొలనులో కనిపించాయి. గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఫొటో ఆధారంగా ఆ మృతదేహం విలియందేనని గుర్తించినట్టు పామ్ బీచ్ కౌంటీ షెరిఫ్ ఆఫీసు ఒక ప్రకటనలో తెలిపింది. 2007లో గూగుల్ ఎర్త్ శాటిలైట్ తీసిన ఫొటోలో ఆ ప్రాంతం కనిపించింది. కాని స్పష్టంగా 2019 వరకు ఎవరూ దీనిని గమనించలేదు.

చార్లీ ప్రాజెక్ట్ ఆధారంగా.. తప్పిపోయిన వ్యక్తుల గురించి సమాచారాన్ని సంకలనం చేసే డేటా బేస్‌లో విలియం అదృశ్యమైన విషయాన్ని గుర్తించాడు. మునిగిన కారు ఎవరిదో గుర్తించేందుకు పామ్ బీచ్ పోస్టు సంబంధిత అధికారులకు రిపోర్టు చేసింది. లాంటనా, వెల్లింగ్టన్ ప్రాంతానికి 20 మైళ్ల దూరంలో ఉన్న కొలను ప్రాంతాన్ని ముందుగా ఓ డ్రోన్ సాయంతో అధికారులు పరిశీలించారు.

ఈ ఏడాది ఆగస్టు 28న కారుతో పాటు విలియం మృతదేహాన్ని గుర్తించారు. పరిశోధకులు కారు మరియు అవశేషాలను ప్రాసెసింగ్ కోసం కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి పంపారు. 22 ఏళ్ల త‌ర్వాత ఈ మిస్ట‌రీని గూగుల్ ఎర్త్ శాటిలైట్ ద్వారా చేధించారు. అయితే ఈ కారు నీటితో ఎలా మునిగిపోయింది? విలియం ఎలా మ‌ర‌ణించాడు? అన్న‌ది స్ప‌ష్టత‌ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news