టీడీపీ అధినేత చంద్రబాబుకు మరింత జలక్ ఇచ్చేందుకు జగన్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీ డీపీలోని కీలక నేతలు చాలా మంది బీజేపీలో చేరారు. పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు, మాజీ మం త్రులు, మాజీ ఎమ్మెల్యేలు కాశాయ కండువా కప్పుకున్నారు. త్వరలోనే మరికొందరు కూడా కమలం గూ టికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అటు బీజేపీకి, ఇటు చంద్ర బాబుకు చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమైనట్లు సమాచారం.
త్వరలోనే వైసీపీలోకి భారీగా వలసలు ఉంటాయని ఏపీలో ప్రచారం జరుగుతోంది. అయితే తన పార్టీలోకి రావాలనుకుంటే.. పదవులకు రాజీనామా చేసి రావాలని గతంలో జగన్ షరతు పెట్టారు. ఈ విషయంలో తా ను వెనక్కి తగ్గేది లేదని కూడా తేల్చిచెప్పారు. ఈనేపథ్యంలోనే టీడీపీకి చెందిన కొందరు ప్ రజాప్రతినిధులు జగన్ పెట్టిన షరతుకు భయపడి మిన్నకుండిపోతుండగా , మరికొందరు ధైర్యం చేసి ముందడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రజా ప్రతినిధులకు మినహాయిస్తే.. మిగిలిన వారికి త్వరలోనే జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే తొలుత టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు జగన్ నుంచి గ్రీన్ సి గ్నల్ లభించినట్లు సమాచారం. తోట త్రిమూర్తులు త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని తెలు స్తోంది. ఈనెల 18న తాను వైసీపీలోకి వెళ్లబోతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ఆయన తోపాటు గతంలో టీడీపీకి రాజీనామా చేసిన ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు సైతం వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. వీరితోపాటు గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన కొందరు నేతలు కూడా ఇప్పుడు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు చూ స్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారందరూ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని.. జగన్ డెసిషన్ ఎలా ఉంటుందో ? అని వీళ్లంతా టెన్షన్‌తో వెయిటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.