BBC పన్నుల అక్రమాలకు పాల్పడింది.. తేల్చిన ఐటీ సర్వే రిపోర్టు

-

గత కొద్ది రోజులుగా బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. పన్నుల అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలతో ఆ సంస్థ కార్యాలయాల్లో సర్వే నిర్వహిస్తున్నామని ఇప్పటికే ఐటీ అధికారులు చెప్పారు. అయితే తాజాగా వారి తనిఖీల్లో బీబీసీ పన్నుల అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. కొన్ని విదేశీ చెల్లింపుల్లో ఇండియాలోని ఆదాయంగా పేర్కొనలేదని ఐటీ అధికారులు వెల్లడించారు.

బహుళజాతి సంస్థకు చెందిన ఒక విభాగం నుంచి మరో విభాగానికి జరిగిన చెల్లింపుల్లో జీఎస్టీ, మేధో సంపత్తి పరంగా ఈ అక్రమాలు జరిగినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఇంగ్లీష్ కాకుండా వివిధ భారతీయ భాషలలో గణనీయమైన కంటెంట్ వినియోగం ఉన్నప్పటికీ, చూపించిన ఆదాయంలో వ్యత్యాసాలు ఉన్నట్లు సర్వేలో గుర్తించినట్లు తెలిపింది. ట్యాక్స్‌ అక్రమాలకు సంబంధించిన పలు ఆధారాలు తమకు లభించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. డిజిటల్‌ ఫైళ్లు, ఇతర ప్రతాల పరిశీలనతో పాటు ఉద్యోగుల నుంచి వివరాల సేకరణ ఇంకా కొనసాగుతున్నదని తెలిపింది. తమ దర్యాప్తును ఆలస్యం చేసేందుకు బీబీసీ సిబ్బంది వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది. అయినా బీబీసీ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా సర్వే చేస్తున్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news