అమ్మాయిల వివాహనికి ప్రభుత్వం సాయం.. అర్హులు ఎవరంటే?

-

ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది.. అర్హులైన, బడుగు, బలహీన వర్గాల వారికి అండగా నిలుస్తుంది.. చిన్న వయస్సు నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరికి పలు పథకాల ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తుంది.. ఈ పథకాల కింద నిరుపేద కుటుంబాలు, నిరుపేదలకు సాయం అందిస్తారు. ప్రతి తరగతి ప్రజల కోసం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది.. అయితే, అమ్మాయిల పెళ్లి కోసం సాయం ఇచ్చే ఒక పథకం కూడా ఉందని చాలా మందికి తెలియదు.. ఇప్పుడు ఆ పథకం గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

మన దేశంలో ఈ పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ పథకం పేరు ఆశీర్వాద్ యోజన. దీనిని గతంలో షాగున్ స్కీమ్ అని పిలిచేవారు. ఈ పథకం ద్వారా ఆడపిల్లల పెళ్లి కోసం కుటుంబానికి రూ.51,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. అయితే ఈ పథకం ప్రయోజనం బాలికలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే ఇస్తారు..ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకొనేవారు.. ముఖ్యంగా పంజాబ్ వాసి అయి ఉండాలి..షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ శాఖ ఈ పథకం కింద ఎస్సీ,బీసీ, ఆర్థికంగా బలహీన వర్గాల  వర్గాలకు చెందిన కుటుంబాలకు ఆడపిల్లల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 51,000 సహాయం అందిస్తుంది. ఇంతకు ముందు ఈ మొత్తం రూ. 21,000 కాగా, జూలై 2021లో రూ. 51,000కి పెంచింది..

అయితే కొంత కాలంగా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందడం లేదు. మరోవైపు ఈ పథకం కింద 50,189 మంది లబ్ధిదారులకు త్వరలో 256 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది.. ఇకపోతే దరఖాస్తుదారు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి..

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

* దరఖాస్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
* ఇప్పుడు వెబ్‌సైట్ ఆశీర్వాద్ యోజన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
* ఆశీర్వాద్ యోజన కోసం దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో మాత్రమే చేయాలి.
* ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత దాన్ని పూర్తిగా పూరించండి.
* ఇప్పుడు ఈ ఫారమ్‌తో అన్ని పత్రాలను అటాచ్ చేయండి.
* ఆ తర్వాత ఫారమ్‌ను సంబంధిత శాఖకు సమర్పించాలి..

ఇలాంటి పథకం మనకు కూడా ఉంది.. ఇటీవల జగన్ డబ్బులను కూడా అర్హులైన వారికి అందించారు..

Read more RELATED
Recommended to you

Latest news