ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది న్యూయార్క్ దర్శకధీరుడు రాజమౌళిని అవమానిస్తూ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇది చదివిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఆ పత్రిక పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.అంతర్జాతీయ పత్రిక ది న్యూయార్క్ ”ది మ్యాన్ బిహైండ్ ఇండియాస్ కాంట్రవర్శియల్ గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRR” అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఇది చదివిన కంగనా రనౌత్ రాజమౌళి దీనిని పట్టించుకునే పరిస్థితిలో లేరని కానీ భారతదేశ కీర్తి పతాకాను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన దర్శకుడి పై బురద చెల్లడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించింది..
తన ట్విట్టర్ లో రాజమౌళిని వివాదాస్పదుడిగా ప్రపంచం ప్రచురించిన సదరు గ్లోబల్ పత్రిక కథనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కంగన.. ”ఏం వివాదాలు సృష్టించారు ఆయన? పోయిన మన భారతీయ సినిమా ఘనతను ప్రపంచం కీర్తించడానికే ‘బాహుబలి’ అనే సినిమా తీశారు రాజమౌళి.. రాజమౌళి ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడు.. ప్రాంతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. అతను ఏ వివాదానికి కారకుడో నాకు తెలుసు. అతను భారత దేశం పట్ల అంకితభావంతో ఉన్నాడు. అది అతని తప్పు కాబట్టి మీరు వివాదాస్పదుడిగా పిలుస్తారు. కానీ ఈ దేశానికి చెందిన వ్యక్తిగా శ్రీ రాజమౌళి జీ సత్యశీలతను సమగ్రతను ప్రశ్నించడానికి ఎంత ధైర్యం?.. అని కంగన అన్నారు.
“ఇది అందరికీ అవమానం.. కళాకారులం పూర్తిగా మా స్వాభిమానంతో ఉన్నాం. కాబట్టి మాపై బురద జల్లేందుకు ధైర్యం చేయకండి. వర్షంలో నిప్పులాంటి రాజమౌళి సార్ పై నేను దేనినీ సహించను. మేధావి జాతీయవాది అత్యున్నత స్థాయి యోగి.. ఆయనను ఈ దేశానికి చెందిన వాడు కావడం మనందరికీ ఆశీర్వాదం” అని ట్వీట్ చేశారు కంగనా..
అలాగే “నేను రాజమౌళి సర్ ని ఎప్పుడూ కలవలేదు లేదా మాట్లాడలేదు. నాకు దేని గురించీ తెలియదు. ఈ ప్రతికూలత అతనిని కూడా బాధించకపోవచ్చు. కానీ నేను ధర్మం సత్యాన్ని అభినందిస్తున్నాను.. రాజమౌళి జీని అభినందిస్తున్నాను” అని కంగన అన్నారు.
అయితే ఆర్ఆర్ లో హిందూ జాతీయవాదాన్ని మన జాతిని గుర్తించారు అని న్యూయార్కర్ తన కథనంలో పేర్కొనగా ఈ విషయంపై విరుచుకుపడ్డారు కంగనా ఇది ఒక రకంగా హిందీ పరిశ్రమ విమర్శకుల పని అని అభిప్రాయపడ్డారు కంగనా..