మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషక పదార్థాలు మనకి అందాలి. అన్ని రకాల పోషక పదార్థాలు మనకి అందాలి అంటే మనం తీసుకునే ఆహారం బాగుండాలి. పోషకాలతో నిండి ఉన్న ఆహార పదార్థాలు ని డైట్లో తప్పక చేర్చుకుంటూ ఉండాలి. విటమిన్ డి కూడా మనకి కచ్చితంగా ఉండాలి. విటమిన్ డి కనుక లేదు అంటే కొన్ని రకాల సమస్యలు తప్పవు విటమిన్ డి లోపం వలన ఎముకలు సమస్యలు, దంతాల సమస్యలు కలుగుతాయి.
శరీరానికి సూర్యరష్మిని తాకినప్పుడు విటమిన్ డి మనకి అందుతుంది అలానే కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా కూడా మనం విటమిన్ డి ని పొందవచ్చు. విటమిన్ డి లోపం లక్షణాలను కనుక మీరు తెలుసుకుంటే కచ్చితంగా విటమిన్ డి లోపం నుండి బయటపడవచ్చు. విటమిన్ డి లోపం కనుక ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనబడతాయి మరి విటమిన్ డి లోపం ఉంటే ఎటువంటి లక్షణాలు కనబడతాయి అనేది ఇప్పుడు చూసేద్దాం.
అలసటగా ఉండడం:
విటమిన్ డి లోపం కనుక ఉన్నట్లయితే అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. తలనొప్పి నిద్ర లేకపోవడం ఆస్తమాను ఎముకలు నొప్పులు వంటివి కలుగుతాయి.
డిప్రెషన్:
విటమిన్ డి లోపం కనుక ఉంటే డిప్రెషన్ కూడా ఉంటుంది డిప్రెషన్ ఉంటే విటమిన్ డి లోపం ఉన్నట్లు గ్రహించాలి. విటమిన్ డి లేకపోవడం వలన మానసిక స్థితి పై ప్రభావం పడుతుంది. కాబట్టి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
గాయం త్వరగా మానకపోవడం:
విటమిన్ డి లోపం ఉంటే గాయాలు కూడా త్వరగా మానవు గాయాలు త్వరగా మానవు. ఇలా జరిగితే కూడా విటమిన్ డి లోపం ఉన్నట్లు గ్రహించాలి.
బలహీనమైన రోగనిరోధక శక్తి:
విటమిన్ డి మీ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది వైరస్లు బ్యాక్టీరియా నుండి రక్షించడానికి సహాయపడుతుంది. తరచూ జలుబు, ఫ్లూ వంటి ఇబ్బందులతో మీరు సతమతమవుతుంటే కూడా విటమిన్ డి లోపం ఉన్నట్లు గ్రహించాలి.