బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనోత్ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె స్టార్ హీరోలను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా మాటలతో తూటాలు పేల్చడంలో ముందుంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ నటి వరుస అవకాశాలు అందుకొచ్చుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న కంగనాకు హృతిక్ తో జరిగిన గొడవలు మాత్రం హాట్ టాపిక్ గానే మారుతూ వచ్చాయి. తాజాగా మరొకసారి హృతిక్ పై ఘాటుగా స్పందించింది ఈ భామ..
హీరోయిన్ కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ అనేందుకు కరెక్ట్ గా సరిపోతారని చెప్పాలి. ముఖ్యంగా ఆమె అనుకున్నది మాట్లాడటంలో.. ఎవరినైనా విమర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. ఈ సమయంలో తనకి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా.. తిరస్కారాలు, అవమానాలు ఎదురైనా తగ్గేదే లేదు అంటూ ముందుకు దూసుకుపోతారు. టాప్ హీరోలను సైతం టార్గెట్ చేసి ఎన్నోసార్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. ముఖ్యంగా 2016లో హృతిక్ తో జరిగిన గొడవలు వైరల్ గానే మారాయి. ముఖ్యంగా హృతిక్, తాను డేటింగ్ చేశామని చెప్తూ అతనిపై పలుమార్లు విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారగా హృతిక్ రోషన్ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే వస్తున్నారు. అయితే తాజాగా అభిమానులతో చేసిన చిట్ చాట్ లో కంగనా మరొక్కసారి రుతిక్ ను టార్గెట్ చేశారు..
కంగనా చేసిన చిట్ చాట్ లో ఓ అభిమాని హృతిక్ రోషన్, దిల్జీత్ దోసాంజ్ వీరిద్దరిలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరని? ప్రశ్నించగా.. కంగనా.. ‘నాకు తెలిసి ఒకరు యాక్షన్ చేస్తారు, మరొకరు పాటల వీడియోలు చేస్తారు. నిజాయితీగా చెప్తున్నా.. వాళ్లు నటించడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఏదైన ఒకరోజు వాళ్లు నిజంగా నటించడం చూస్తేనే చెప్పగలను. అలాంటిది జరిగితే నాకు తెలియజేయండి. థాంక్స్..’ అంటూ ముగించింది. ఈ విషయంపై హృతిక్ రోషన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు స్టార్ హీరోకి నటించిన రాకపోతే గుజారీస్ కోయి మిల్ గయా సూపర్ థర్టీ వంటి చిత్రాల్లో అతను చేసింది ఏంటి మరి నీకంటే చాలా బెటర్ యాక్టర్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు..