టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పటికే టీటీడీ బోర్డు సభ్యుడిగా ఒంగోలు మాజీ ఎంపీ, జగన్ బాబాయ్ వైవి.సుబ్బారెడ్డి పేరును ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం బోర్డు సభ్యుల ఎంపికలో లేట్ చేయడంతో సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. ఎట్టకేలకు ఈ రోజు బోర్డు మెంబర్లను కూడా ప్రకటించింది. ఏపీ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో చోటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏపీ నుంచి చోటు దక్కించుకున్న వారిలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక తమిళనాడు కోటాలోనూ ఓ ఎమ్మెల్యేకు చోటు దక్కింది. ఇక ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణ నుంచి మైహోమ్ రామేశ్వరరావుతో పాటు మొత్తం ఏడుగురు సభ్యులకు ఛాన్స్ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాలు అయిన తమిళనాడు నుంచి నలుగురు, కర్నాకట నుంచి ముగ్గురుతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా మరొకరికి చోటు దక్కింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి చోటు దక్కించుకున్న వారు….
1. కె. పార్థసారథి ( పెనమలూరు ఎమ్మెల్యే )
2. యూవీ రమణమూర్తి ( యలమంచిలి ఎమ్మెల్యే )
3. మల్లికార్జున రెడ్డి (రాజంపేట ఎమ్మెల్యే )
4. గొల్ల బాబురావు (పాయకరావుపేట ఎమ్మెల్యే )
5. నాదెండ్ల సుబ్బారావు
6. వీ.ప్రశాంతి
7. చిప్పగిరి ప్రసాద్ కుమార్
8. డీపి. అనంత
తెలంగాణ నుంచి టీటీడీ బోర్డు సభ్యులు
1.జూపల్లి రామేశ్వరరావు
2. బి. పార్థసారథిరెడ్డి
3. యూ. వెంకట భాస్కర్రావు
4. మూరంశెట్టి రాములు,
5. డి. దామోదర్ రావు,
6. కే శివకుమార్
7. పుత్తా ప్రతాప్ రెడ్డి
తమిళనాడు నుంచి…
1. కృష్ణమూర్తి వైద్యనాథన్
2. ఎస్. శ్రీనివాసన్
3. డా. నిచిత ముట్టువరపు
4. కుమారగురు. ఎమ్మెల్యే
కర్నాటక నుంచి టీటీడీ సభ్యులుగా…
1. రమేష్ శెట్టి
2. సంపత్ రవి నారాయణ
3. సుధా నారాయణమూర్తి
మహారాష్ట్ర
1. రాజేశ్ శర్మ
ఢిల్లీ
1. ఎంఎస్ శివ శంకరన్
వీరితో పాటు తుడా చైర్మన్, స్పెషల్ సీఎస్, దేవాదాయ కమిషనర్, టీటీడీ ఈవోలు ఎక్సాఫిసియో సభ్యులుగా ఉంటారు.