మే 17న ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌

-

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను 2020, మే 17న నిర్వహించనున్నారు. ఈసారి ఈ పరీక్షను ఐఐటీ-దిల్లీ నిర్వహించనున్నది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీని ఐఐటీ జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డ్‌ ఖరారు చేసింది. మొట్టమొదటిసారిగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాంగోపాల్‌ చెప్పారు. భారత్‌లోని ఐఐటీల్లో చదువుకున్న చాలా మంది అమెరికాలో ఉన్నందునే అక్కడ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

విదేశాలలో కూడా అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కేంద్రాలు
దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేరుగాంచిన ఐఐటీల్లో ప్రవేశాలకు ఏటేటా రాసేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో ఆయా దేశాల్లో ఉంటున్న ఇండియన్‌ విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనతో ఈసారి ప్రపంచంలోని పలు ప్రదేశాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఐఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ని వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఐఐటీ జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) పరీక్షను యూఏఈలోని దుబాయ్‌, నేపాల్‌ రాజధాని ఖాట్మాండూ, ఇథియోపియా రాజధాని ఆడిస్‌ అబాబా, శ్రీలంక రాజధాని కొలంబో, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా, సింగపూర్‌లలో నిర్వహించారు.

అడ్వాన్స్‌డ్‌కు 2లక్షల 50 వేలమందికి అవకాశం

జేఈఈ మెయిన్స్‌ నుంచి గతంలో కంటే వచ్చే ఏడాది 10 వేల మందిని ఎక్కువగా తీసుకుంటామని రాంగోపాల్‌ వెల్లడించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అన్ని కేటగిరీలతో కలిపి 2 లక్షల 50 వేల మంది విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు.

ముఖ్యతేదీలు:
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ: 2020 మే 17
మొదటి పేపర్‌: ఉదయం 9 నుంచి మ.12 వరకు
రెండో పేపర్‌: మధ్యాహ్నం 2.30 నుంచి సా.5.30 వరకు
వెబ్‌సైట్‌: http://www.iitd.ac.in

Read more RELATED
Recommended to you

Latest news