5 ముఖాల శివుడు.. 25 ముఖాలు, 50 చేతులతో కొలువైన స్వామి!

-

శివుడు.. పంచభూతాత్మికుడు..సాధారణంగా శివుడు ఐదుముఖాలతో ఉంటాడు. 5 ముఖాల శివుడు.. 25 ముఖాలు, 50 చేతులతో కొలువైన స్వామి ఎక్కడో తెలుసా! నిత్యపూజలో మనం సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాలనేవి ఆ ముఖాల పేర్లుతో అర్చిస్తాం. ఆయన ఈ ఐదు ముఖాలు పంచభూతాలకు ఇవి ప్రతీకలు. అయితే అసాధారణమైన శివరూపాలు అక్కడక్కడా ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ రూపం. 25 ముఖాలతో కన్పిస్తున్న స్వామి అరుదైన రూపం ఇక్కడి ప్రత్యేకం. ఆ వివరాలు తెలుసుకుందాం…. తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం అందరికీ సుపరిచితమే. ఈ ఆలయం మూడుప్రాకారాలతో, అనేక గోపురాలతో, గోపురాల నిండా దేవతా విగ్రహాలతో శోభిల్లుతుంటుంది.

ఆలయానికి తూర్పున ఉన్న గోపురంపై పరమేశ్వరుని విగ్రహం ఉంది. కానీ ఇక్కడ శివుడు 25 ముఖాలతో, యాభైచేతులతో వివిధ ఆయుధాలు ధరించి కనిపిస్తాడు. సద్యోజాతమూర్తి, వామదేవమూర్తి మొదలైన ఐదుగురు దేవతలు ఒక్కొక్కరూ ఐదు ముఖాలతో కనిపిస్తుండగా ఈ స్వామి ఆ ఐదుగురి సమిష్టిరూపం. ఈయన ముఖాలు కింది వరుసలో 9, దానిపై 7, ఆపై 5, 3, 1 ఇలా బేసి సంఖ్యలో ఉంటాయి. కుడివైపు 25 చేతులతో, ఎడమవైపు 25 చేతులు ఉంటాయి.

కైలాసపర్వతంపై పరమేశ్వరుడు ఇలాగే ఉంటాడని స్కాందపురాణం చెబుతోంది. మరికొన్నిచోట్ల ఈయనను మహాసదాశివమూర్తి అని కూడా పిలిచారు.ఈ విగ్రహంలోని 25 ముఖాలూ ఒక్కో కృత్యానికి 5 చొప్పున 25 లీలారూపాలను, ఆయా లీలారూపాలలో ధరించిన ఆయుధాలను ధరించి కనిపిస్తున్నాడు. ఇరవై ఐదు రూపాలను దర్శిస్తే కలిగే ఫలితం ఒక్క మహా కైలాసమూర్తి దర్శనంతో లభిస్తుందని, సాలోక్య ముక్తి లభిస్తుందనీ శైవాగమాలు చెబుతున్నాయి. ఇక ఆలస్యమెందుకు ఈసారి దక్షిణ భారత యాత్రచేసినప్పుడు తప్పక ఈ అరుదైన మహాసదాశివుడిని దర్శించి అనుగ్రహాన్ని పొందండి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news