అక్షయ్ కుమార్ బాలీవుడ్లో అగ్ర హీరోల్లో ఒకరు. ఇప్పటికే అగ్ర హీరోల్లో ఒకరు గానే ఉన్నప్పటికీ.. ఒకప్పుడు వరుసగా హిట్లు అందుకుంటున్న ఈ హీరో ప్రస్తుతం ఫెయిల్యూర్ చిత్రాలతో సతమతం అవుతూ ఉన్నాడు. రామసేతు, కట్టుపల్లి పృథ్విరాజ్ వంటి చిత్రాలతో అక్షయ్ కుమార్ పరాజయాన్ని చవిచూశారు. గత ఎనిమిది చిత్రాలుగా విజయం అంటూ లేనటువంటి అక్షయ్ కుమార్ ప్రస్తుతం తన సినిమాలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయో చెప్పుకొచ్చారు.
గత కొన్నాళ్లుగా అక్షయ్ కుమార్ సినీ కెరియర్ డల్ గానే నడుస్తుంది. ఇప్పటివరకు తీసిన ప్రతి చిత్రం ఫెయిల్ అవుతూ ఉండటంతో తాజాగా ఈ విషయంపై స్పందించారు అక్షయ్.. “ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. వారు కొత్తదనం కోరుకుంటున్నారు.. కాబట్టి మనందరం కూడా వారి ఆలోచనలు తగ్గట్టుగా సినిమా తీయాల్సినటువంటి అవసరం ఉంది.. నిజానికీ తప్పంతా నాదే ప్రేక్షకులది కాదు. కథల ఎంపిక లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే..” అంటూ చెప్పుకొచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు.
అక్షయ్ కుమార్ ప్రస్తుతం చత్రపతి శివాజీ జీవిత చరిత్ర సినిమాగా తీయబోతున్నారు. దీనికి మహేష్ సొన్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా అక్షయ్ కుమార్ ఇటీవల తన పౌరసత్వం సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. “తనకు భారతదేశంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉండేదని కానీ ఇప్పుడు కెనడా పౌరుసత్వాన్ని వదులుకున్నానని.. కేవలం భారతదేశం మాత్రమే తనకు ఇల్లని నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే నా యొక్క లక్ష్యమని.. ” ఆయన ప్రకటించారు.. కాగా అక్షయ్ కుమార్ కరోనా సమయంలో 25 కోట్ల రూపాయలను ప్రజలకు దానం ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు.