సమంత నాగచైతన్య క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ఏ మాయ చేసావే సినిమా ఈరోజుకి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయింది.. సమంత ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినీ బృందంతో పాటు సమంతకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి..
సమంత ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. ఇలా 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమంతకి అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఏమాయ చేసావే సినిమాతో సినిమా ప్రయాణాన్ని ప్రారంభించింది సమంత. ఈ చిత్రంలో ఆమె నాగచైతన్యకు తోడుగా నటించింది.. అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడి వివాహం కూడా చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే మనస్పర్ధలతో విడిపోయారు. సమంత సినీ కెరియర్ మొదలై 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానుల ఆమెకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టాలీవుడ్ లో నటి సమంత ఎంతో విజయవంతంగా తన కెరీర్ ని కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలోనే ఆమె యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ఆమె మాయోసైటిస్ వ్యాధిబారిన పడటం వల్ల అభిమానులు అందరూ కలవరానికి గురయ్యారు. కానీ ఇటీవల కాలంలో ఆమె ఆ వ్యాధిని జయించి తిరిగి వర్కర్స్ మొదలుపెట్టడం వల్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాగా ప్రస్తుతం సమంత వరుసగా సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతూ కెరియర్ని అత్యంత విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలోనే ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.