బోటు ప్రమాదంపై షాకింగ్ న్యూస్..? కుర్చీలాటే కొంప ముంచిందా..?

-

గోదావరి నదిలో కచ్చులూరు మందం వద్ద దాదాపు 40 మంది వరకూ మృత్యువాతపడిన బోటు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ వార్తలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ఠ బోటులో ప్రమాదానికి ముందు పర్యాటకులు ఆడిన కుర్చీలాటే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సరిగ్గా బోటు మునిగిపోయేందుకు కొద్ది నిమిషాల ముందు.. పర్యాటకులంతా ఉత్సాహంగా మ్యూజికల్ చైర్స్ ఆడినట్టు పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది.

కుర్చీలాట ఆడే ఊత్సాహంలో ఉరుకులు, పరుగుల కారణంగా అప్పటికే ప్రమాదంలో ఉన్న బోటు ఓవైపుకు ఒరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అప్పుడే కొందరు నీటిలోకి జారిపోయారట. ఆ సమయంలో మిగిలిన వారంతా మరోవైపుకు పరుగు పెట్టడంతో బోటు మరింతగా ఒరిగినీటిలో మునిగినట్టు అంచనా వేస్తున్నారు.ఆ బోటులో లైఫ్ జాకెట్లు చాలినన్ని ఉన్నా.. ఆ కంగారులో కొందరికి మాత్రమే జాకెట్లు వాడాలన్న ఆలోచన వచ్చింది. మిగిలిన వారు కంగారులో ఆ విషయం విస్మరించారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలోని భయంకరమైన సుడిగుండాలు కూడా ప్రమాదానికి కారణంగా నిపుణులు భావిస్తున్నారు. అసలు ఇంతటి భయంకరమైన సుడిగుండా తన జీవితంలోనే చూడలేదని మునిగిపోయిన బోట్లను వెలికితీయటంలో అనుభవమున్న మత్స్యకారుడు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం చెబుతున్నారు. బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం విపరీతంగా ప్రయత్నిస్తోంది. అయితే వారి బోట్లను కూడా సుడిగుండాలు తమవైపు లాక్కునే ప్రయత్నం చేశాయట.

బోటును పైకి తీసేందుకు గోదావరిలో వేస్తున్న మందపాటి తాళ్లను, యాంకర్లను కూడా ఈ సుడిగుండాలు తమలోకి లాగేసుకుంటున్నాయని.. ధర్మాడి సత్యం వివరించారు. ఇంతటి మహా సుడిగుండాన్ని తానెప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదని.. డిస్కవరీ ఛానెల్‌లోనే చూశానని ధర్మాడి సత్యం చెబుతున్నాడంటే.. అవి ఎంతటి సుడిగుండాలో అర్థం చేసుకోవచ్చు. వీటిపై అవగాహనలేని డ్రైవర్లు బోటును నడపటం కూడా ప్రమాదానికి దారి తీసింది.

Read more RELATED
Recommended to you

Latest news