ప్రీతి కేసులో మరో ట్విస్ట్..పొత్తి కడుపు వద్ద సర్జరీ ?

-

మెడికల్‌ విద్యార్థి ప్రీతి కేసులో ప్రీతి సోదరుడు పృధ్వీ సంచలన విషయాలు బయట పెట్టాడు. నిమ్స్ లో ప్రీతి పొత్తి కడుపు వద్ద సర్జరీ చేశారని.. ఆ సర్జరీ ఎందుకు చేశారు తెలీదని పేర్కొన్నారు ప్రీతి సోదరుడు పృధ్వీ. ప్రీతీ కి చేతి పై గాయం ఉందని… ప్రీతీ కి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలిసిస్ చేశారని ఫైర్‌ అయ్యాడు.

పోస్ట్ మార్టం లో మరి ప్రీతి బాడీ లో ఉన్న ఇంజెక్షన్ గురించి ఎలా తెలుస్తుందని.. నిమ్స్ లో ఎం వైద్యం చేశారు మాకు చెప్పాలన్నారు. ర్యాగింగ్ కమిటీ పై మాకు అనేక అనుమానాలు ఉన్నాయని.. నాగార్జున రెడ్డి తప్పు చేసిన వ్యక్తి అయితే అసలు అతన్ని ర్యాగింగ్ కమిటీ లో ఉంచుతారని వివరించారు. ప్రీతీ సెల్ ఫోన్ లో మెసేజ్ లు నేను చెక్ చేశానని.. నాకు కనిపించని మెసేజ్ లు పోలీసులకి ఎలా కనిపించాయని ఆరోపించారు ప్రీతి సోదరుడు పృధ్వీ.

Read more RELATED
Recommended to you

Latest news