‘వ్యక్తిగతంగా తాను రాజధానిగా అమరావతికే మద్దతు ఇచ్చానని ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ అన్నారు. అయితే తాను ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్ప,్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన కవులూరులో పర్యటించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అమరావతి రాజధానిపై ఓ ఎమ్మెల్యేగా మీరెందుకు స్పందించడం లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు కృష్ణప్రసాద్‌ను ప్రశ్నించారు. రాజధానిపై అయోమయం నెలకొనడంతో తమ భూముల ధరలన్నీ తగ్గిపోయాయని అన్నారు. దీనికి ఎవరు బాధ్యులని రాంబాబు నిలదీశారు. రాంబాబు ప్రశ్నలతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పైన చెప్పినట్టు సమాధానమిచ్చారు.
మరోవైపు ఇవాల రాజధాని అమరావతి అంశం సుప్రీం కోర్టులో ప్రస్తావనకు రానుంది. అమరావతికి సంబంధించిన కేసులు త్వరితగతిన విచారణ జాబితాలో చేర్చాలంటూ సుప్రీం కోర్టులో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించనుంది. అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గత సోమవారమే జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించిన విషయం తెలిసిందే.