అబ్బాయిల కోసమే ఈ బ్యూటీ టిప్స్‌.. రిజల్ట్‌ పక్కా..!!

-

అందం గురించి మాట్లాడుకుంటే.. ఎప్పుడూ మహిళలకు సంబంధించిన చిట్కాలే ప్రస్తావనకు వస్తాయి.. వాళ్లకు ఉన్న సమస్యలకు ఏం చేస్తే బాగుంటుంది ఇలా. అప్పడు కొంతమంది బాయ్స్‌ అడుగుతుంటారు.. ఇది అబ్బాయిలు కూడా ట్రై చేయొచ్చా అని. కేవలం బాయ్స్‌ కోసమే ఈ బ్యూటీ టిప్స్‌.. బాయ్స్‌కు పెద్దగా చర్మ సమస్యలకు ఉండవు. బయట ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి.. ట్యాన్‌ ఎక్కువగా ఉంటుంది. ముఖం నల్లగా అయిపోతుంది. ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే.. దాంతో ముఖంలోని నలుపుదనం పోతుంది. తెల్లగా, కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..

Paradise Mens Beauty Parlour, Vivekananda Nagar, Hyderabad - nearbuy.com

పైనాపిల్‌ను ముక్కలుగా కోసి ఒకటి రెండు ముక్కలతో ముఖంపై బాగా రుద్దాలి. దీని వల్ల కూడా ముఖంపై ఉండే దుమ్ము, ధూళి పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. రోజుకు ఇలా ఒకసారి చేయవచ్చు.

ఒక టీస్పూన్‌ తేనె, ఒక టీస్పూన్‌ కాఫీ పొడి, కొన్ని చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ముఖంపై అప్లై చేయాలి. కొన్ని నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేయాలి. దీంతో ముఖం మెరిసిపోతుంది.

వేపాకులను పేస్ట్‌లా చేసి అందులో చందనం పొడి, బాదంపప్పు పొడి, పసుపు పొడి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంలోని నలుపుదనం పోయి తెల్లగా మారుతుంది. ఈ టిప్‌తో రిజల్ట్‌ వెంటనే వస్తుంది. వారంలో 2 సార్లు ఇలా చేస్తే చాలు. అయితే పసుపు, చందనంలను పురుషులు రాసుకోవచ్చా ? అనే డౌట్‌ మీకు రావొచ్చు.. నిర్భయంగా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు. ఎలాంటి సందేహాలు అవసరం లేదు.

mens beauty parlour - Online Discount Shop for Electronics, Apparel, Toys, Books, Games, Computers, Shoes, Jewelry, Watches, Baby Products, Sports & Outdoors, Office Products, Bed & Bath, Furniture, Tools, Hardware, Automotive Parts,

 

ముఖాన్ని క్లీన్‌ చేయడంలో తేనె, నిమ్మరసం మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి మిక్స్‌ చేసి దాన్ని ముఖానికి రాయాలి. 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి. రోజూ ఇలా రెండు సార్లు చేయాలి. దీంతో ముఖంపై ఉండే దుమ్ము, ధూళి, మృత కణాలు పోతాయి. ముఖం శుభ్రంగా మారుతుంది. ముఖంలోని నల్లదనం పోతుంది. ముఖం తెల్లగా, అందంగా కనిపిస్తుంది.

చర్మాన్ని క్లీన్‌ చేయడంలో ఆరెంజ్‌ జ్యూస్‌ బాగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్‌ సి చర్మానికి మెరుపును ఇస్తుంది. రెండు టేబుల్‌ స్పూన్ల ఆరెంజ్‌ జ్యూస్‌ను తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ ప్యాక్‌ను ముఖానికి రాసి 20 నిమిషాల పాటు ఉంచి నీటితో కడిగేయండి. ఇలా తరచూ చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

The modern man's guide to affordable men beauty products - Purplle

బొప్పాయి పండును పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేయాలి. దీని వల్ల బొప్పాయిలోని ఎంజైమ్స్‌ చర్మాన్ని శుభ్రం చేస్తాయి.

మార్కెట్‌లో మనకు విటమిన్‌ ఇ క్యాప్సూల్స్‌ లభిస్తాయి. ఆ క్యాప్సూలో ఆయిల్‌ ఉంటుంది.. దాన్ని ముఖంపై అప్లై చేయాలి. గంట సేపటి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేయాలి. ఫేస్‌ క్లీన్‌గా మారి..తెల్లగా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news