BREAKING : కొడాలి నాని పై అరెస్టు వారెంట్ జారీ

-

కొడాలి నానికి బిగ్‌ షాక్‌ తగిలింది. కొడాలి నాని పై అరెస్టు వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. కొడాలి నాని పై అరెస్టు వారెంట్ జారీ చేయాలని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ పేట సిఐకి న్యాయమూర్తి గాయత్రీ దేవి ఆదేశాలు జారీ చేశారు.

2016 మే 10 న పోలీసు ఉత్తర్వులు లెక్కచేయకుండా కొడాలి నాని, కోలుసు పార్థసారథి భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించి కొడాలి నాని పలుమార్లు కోర్టుకు హాజరు అవ్వకపోవడంతో నేడు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అటు, మంత్రి గుడివాడ అమర్నాథ్ కు విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కం రైల్వే న్యాయస్థానం నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.

2018 ఏప్రిల్ 11వ తేదీన గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురు వైసిపి నాయకులు ప్రత్యేక హోదా రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ లోకి అనధికారికంగా ప్రవేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురిపై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులో భాగంగా ఫిబ్రవరి 27వ తేదీన మంత్రి గుడివాడ అమర్నాథ్ కోర్టుకు హాజరు కాలేదు. ఈ తరుణంలోనే తాజాగా గుడివాడ అమర్నాథ్ కు నాన్వెలబుల్ వారంటూ జారీ చేసింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news