రెండో రోజు ఇన్వెస్టర్స్ సమ్మిట్..కీలక ఒప్పందాలు చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం

-

విశాఖలో రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఇవాళ జరుగనుంది. ఈ నేపథ్మంలోనే ఇవాళ ఉదయం 9:50 గంటలకు ర్యాడిసన్ నుంచి బయల్దేరనున్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు చేసుకోనుంది ఏపీ ప్రభుత్వం.

ఇక ఇవాళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు 11 మంది పారిశ్రామికవేత్తలు. అనంతరం పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ ఉప న్యాసం ఉండనుంది. ఈ కార్యక్రమానికి ఇవాళ కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, శర్వానంద్ సోనోవాలా హాజరుకానున్నారు. మ.12:45 గంటల కు సీఎం జగన్ ముగింపు ఉప న్యాసం ఉండనుంది.

అటు ఆదాని గ్రూపు ఏపీలో వివిధ రంగాల్లో ఇప్పటికే రూ.20వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని ఆదాని స్పోర్ట్స్ CEO కరణ్ ఆదాని తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు.ఇన్వెస్టర్ సమ్మిట్ లో మాట్లాడుతూ, ‘గంగవరం, కృష్ణపట్నం పోర్టుల సామర్థ్యాన్ని 200 మి. ట. ల.కు పెంచనున్నాం. రెన్యువబుల్ ఎనర్జీలో 15వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నాం’ అని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news