ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇటీవల అరెస్టు అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి కస్టడీ పొడగింపు అయింది. రాఘవరెడ్డి కస్టడీని మరో 14 రోజులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
రాఘవరెడ్డి కస్టడీ నేటితో ముగియనున్న నేపథ్యంలో సిపిఐ అధికారులు ఆయనని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అధికారులతో ఏకీభవించిన న్యాయస్థానం అతడికి మరో 14 రోజులపాటు కస్టడీకి అనుమతించింది. అటు ఈ నెల 16న రాఘవ డైలీ పిటిషన్ ను విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు సంస్థలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి నివాసాలలో సోదాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.