త్వరలో నిజామాబాద్ లో ఐటీ హబ్ ప్రారంభిస్తామని తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శనివారం రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో నిర్మాణం అవుతున్న ఐటి హబ్ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్ లో త్వరలోనే ఐటీ హబ్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. 50 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఐటీ హబ్ లో 750 మంది యువతకు, నాలుగు వేల మంది ఇతర ప్రాంత వాసులకు ఉద్యోగ, ఉపాధికి అవకాశం లభిస్తుంది అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ఐటి హబ్ ఒక ఆరంభం లాంటిదన్నారు. నిజామాబాద్ లో ఐటి హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్, కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.