ఇప్పటికీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్న కొందరు భారతీయులు కాదు. అంటే ఏంటి అసలు భారతీయులు కాదు అంటే భారతీయ పౌరసత్వం లేని వాళ్ళు. ఏదైనా కారణాలతో విదేశాల్లో పుట్టి ఉండవచ్చు లేదా అక్కడ పుట్టి, ఇక్కడ స్టార్ గా మారి ఉండవచ్చు. ఏది ఏమైనా ఇప్పటికీ భారతీయ పౌరసత్వం లేకుండా విదేశీ పౌరసత్వం కొనసాగిస్తూనే వస్తున్న మన స్టార్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
ఇప్పటికీ మనం భారతీయనే అనుకుంటూ బ్రమ పడుతున్న కొందరు స్టార్లకు అసలు భారతీయ పౌరసత్వమే లేదు. వీరు ఇప్పటికీ విదేశీ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ పౌరులు గానే కొనసాగుతూ ఇక్కడ స్టార్లుగా మారారు..
భారతీయ సినీ ఇండస్ట్రీలో హెలెన్ తెలియని వారు ఎవరూ ఉండరు. ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోయినా ఒకప్పుడు సినిమాలను ఏలిన రాణి. ఓ ఆంగ్లో ఇండియన్ తండ్రికి బర్మా తల్లికి పుట్టినా బర్మా పౌరసత్వమే కొనసాగించిన హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. భారతీయ సినిమాల్లో నటించిన తొలి విదేశీ మహిళ ఈమె..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే. నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతూ అత్యధిక రిమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ల ఒకరిగా కొనసాగుతున్నారు. తాజాగా పటాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ భామ.. డెన్మార్క్ లో పుట్టింది బెంగళూరులో పెరిగినప్పటికీ ఇప్పటి డెన్మార్క్ సిటిజన్షిప్ ని కొనసాగిస్తూ వస్తుంది..
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహేష్ బట్ తనయగా బాలీవుడ్లో అడుగుపెట్టిన అలియా భట్.. స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అయితే ఈమె నిజానికి బ్రిటిష్ పౌరసత్వం కొనసాగిస్తూ వస్తున్నారు. బ్రిటిష్ మూలాలు ఉన్న సోనీ రజ్దన్ కూతురు కావడం వల్ల ఆ పౌరసత్వమే కొనసాగిస్తూ వచ్చారు. అయితే కొన్నాళ్ల క్రితమే బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ను పెళ్లి చేసుకొని భారతీయురాలుగా మారారని వార్తలు వినిపిస్తున్నాయి..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను ఇండియన్ కాదు అనే విమర్శ ఎప్పటినుంచో వెంటాడుతూ వస్తుంది. నిజానికి అక్షయ పంజాబ్ ఢిల్లీలో పెరిగాడు. కానీ అతనికి కెనడా సిటిజన్షిప్ ఉంది. అయితే ఈ విషయంపై విమర్శలు ఎక్కువ అవుతుండటంతో తాజాగా ప్రస్తుతం నాకు భారతీయ పౌరసత్వం తప్పా వేరే ఏ దేశం పౌరసత్వం లేదు. నేను భారతీయుణ్ణి. భారతీయుల కోసం మాత్రమే కష్టపడతాను నా దేశాన్ని కాపాడుకోవడమే నా లక్ష్యం అంటూ క్లారిటీ ఇచ్చేశాడు ఈ హీరో..
స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఇండియన్ కాదు. కత్రినా తండ్రి ఒక కశ్మీరీ… కానీ ఈమె పుట్టింది మాత్రం హాంగ్ కాంగ్… తన తల్లి బ్రిటన్ దేశస్థురాలు. ఈమెకు కూడా బ్రిటిష్ పౌరసత్వం ఉంది. ఇప్పటికీ కొనసాగుతోంది..
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ బంధువు ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పుట్టాడు. ఇతను పుట్టాక తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లితో పాటు ముంబైకి వచ్చి స్థిరపడ్డాడు. కానీ ఇప్పటికీ అమెరికా పౌరుషత్వమే కొనసాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిజానికి శ్రీలంక పౌరురాలు. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక బ్యూటీ కాంటెస్ట్ విజేత. ఆమె పుట్టింది బహరెయిన్ కానీ తల్లిదండ్రుల కారణంగా శ్రీలంక సిటిజెన్‌షిప్ పొందింది. ఇప్పటికే ఆపావురసత్వమే కొనసాగిస్తూ వస్తుంది.
అలాగే బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రి అమెరికా పౌరసత్వాన్ని కొనసాగిస్తుండగా అమీ జాక్సన్ కూడా బ్రిటిష్ పౌరురాలు. పాకిస్థాన్ పౌరుడు ఫావద్ ఖాన్ భారతీయ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి నటుడుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.