Balagam : ‘బలగం’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

చిన్న సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న మూవీ బలగం. తెలంగాణ నేటివిటీకి దగ్గరగా ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. నిజజీవితానికి దగ్గరగా ఉన్న ఈ సినిమా తమ జీవితాలకు అద్దం పడుతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే రోజురోజుకు ఈ చిత్రానికి వసూళ్ల ప్రవాహం పెరుగుతూనే ఉంది.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు జబర్దస్త్ వేణు దర్శకత్వం వహించారు. దిల్​రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. భావోద్వేగాలను, పల్లె అందాలను, తెలంగాణ సంసృతిని కళ్లకు కట్టినట్లు చూపించిన వేణు టేకింగ్‌, విజన్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news