“దసరా” ప్రమోషన్స్ కోసం చెన్నైకి నాని

-

నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం దసరా. ఈ చిత్రం మార్చి 30వ తేదీన తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. గోదావరిఖని బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం నిర్మాతలు చాలా కొత్తగా ప్రయత్నం చేస్తున్నారు.

 

నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం దసరా. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నాని చెన్నైలో అడుగు పెట్టాడు. తమిళ్ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో పర్యటించనున్నారు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 31 తేదీన భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news