ఆచార్య చాణక్య మన జీవితంలో కలిగే సమస్యల గురించి ఎంతో చక్కగా చెప్పారు ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పినట్లు నిజ జీవితంలో మనం ఆచరిస్తే ఎటువంటి బాధ ఉండదు. ఎంతో ఆనందంగా జీవించొచ్చు. జీవితంలో జరిగే చాలా సంఘటనల గురించి ఆచార్య చాణక్య వివరించారు. ఎటువంటి సమస్యనైనా సరే మనం చాణక్య చెప్పినట్లు ఆచరించి దూరం చేసుకోవచ్చు. ఎదుట వ్యక్తిని నమ్మే ముందు కూడా కొన్ని విషయాలని ఆలోచించాలని ఆచార్య చాణక్య అన్నారు. మరి ఎటువంటి విషయాలని ఎదుట వ్యక్తిని నమ్మేముందు మనం ఆలోచించాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ప్రతి వ్యక్తిలో కూడా మంచి చెడు అనే లక్షణాలు ఉంటాయి. అలానే సోమరితనం, గర్వం, అబద్ధాలు ఆడడం ఇలా చాలా ఉంటాయి. ఎవరైతే ప్రశాంతంగా గంభీరంగా ఉంటారో అటువంటి వ్యక్తి ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. అలానే వాళ్ళు ఎప్పుడూ కూడా సన్మార్గంలో నడుస్తారని ఆచార్య చాణక్య అన్నారు.
సోమరితనం గర్వం అబద్ధం చెప్పడం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని అసలు నమ్మకూడదని చాణక్య అన్నారు. అలానే ఏ వ్యక్తి ని అయినా మీరు నమ్మే ముందు వాళ్ళ లో త్యాగం చేసే గుణం ఎంత దాకా ఉంది అనేది చూడాలి. అలానే ఇతరుల జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి తన ఆనందాన్ని సైతం త్యాగం చేస్తారో అలాంటి వాళ్ళు మీ బాధను కూడా అర్థం చేసుకోగలరు. అటువంటి వ్యక్తులని నమ్మొచ్చు.
ఏ వ్యక్తి ని అయినా మీరు నమ్మే ముందు ఆ వ్యక్తికి ఇంట్లో ఉన్న స్థానం ఏంటి అనేది మీరు చూడాలి. అలానే ఆ వ్యక్తి బయట ఎలా ఉంటారనేది కూడా చూడాలి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ డబ్బుకి ప్రయారిటీ ఇస్తున్నారు. బంధాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా మీరు గమనించి ఆ తర్వాత మాత్రమే నమ్మండి. కొందరు వ్యక్తులు స్వార్థంగా ఉంటారు అటువంటి వాళ్ళని నమ్మకూడదు అని చాణక్య అన్నారు.