దేశరాజధానిలో కూలిన భవనం.. టెన్షన్.. టెన్షన్..

-

ఢిల్లీలో మూడు అంతస్తులు గల భవనం నేడు నేలమట్టమైంది. విజయ్ పార్క్, భజరన్ పురా ప్రాంతంలో మార్చి 8న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం అందింది. బిల్డింగ్ కూలిన విజువల్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. ఓ ఇరుకు సందులో.. కుడి వైపు ఉన్న ఈ భవనం, ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో కుప్పకూలి, ఎదురుగా ఉన్న ఇళ్లపై పడింది. ఈ ఘటనతో స్థానికులు అందరూ భయంతో పరుగులు తీశారు. ఇళ్లల్లోకి వెళ్లటానికి కూడా భయపడుతున్నారు.

Delhi: Multi Storey Building Collapses on Road, Dramatic Visuals Emerge

ప్రమాదం జరిగిన ప్రాంతానికి మూడు ఫైరింజన్లు వచ్చాయి. పోలీస్ బృందాలు చేరుకున్నాయి. బిల్డింగ్ శిథిలాల తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అనేది పరిశీలిస్తున్నారు అధికారులు. ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా లేదా.. బిల్డింగ్ కూలిపోవటానికి కారణాలు ఏంటీ.. స్థానికులు ఏమంటున్నారు.. రద్దీగా ఉంటే ఓ స్లమ్ ఏరియాలో.. ఓ ఇరుకు సందులోని బిల్డింగ్ కూలిపోవటం వెనక ఏదైనా కారణం ఉందా .. ఇలాంటి విషయాలపై పోలీసులు తమ భావాన్ని వ్యక్తపరచాల్సి ఉంది. ఈ సంఘటనతో ఇక్కడ ఉంటున్న స్థానికులు మాత్రం ఎంతో భయాందోళనకు గురయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news