నాకో రూల్‌.. అవినాష్‌కు మరో రూలా?: ఎంపీ రఘురామ

-

ఎంపీలు దాఖలు చేసే పిటిషన్లను సీజే ధర్మాసనం విచారిస్తుందన్న నియమావళికి భిన్నంగా కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్‌ మరో ధర్మాసనానికి వెళ్లిందని వైసీపీ ఎంపీ రఘురామ అన్నారు. దీని వెనుక మర్మమేంటో అంతుచిక్కడం లేదని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసులు కుట్ర చేసి తనపై నమోదు చేసిన కేసును సవాలు చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి వెళ్లిందని తెలిపారు.

ఎంపీగా తనకు ఒక నిబంధన.. అవినాష్‌రెడ్డికి మరో నిబంధనా అని రఘురామ ప్రశ్నించారు. అరెస్టు ఖాయమని తేలడంతో అవినాష్‌రెడ్డి తన స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు మార్చే అవకాశం ఉందనే కొత్త వాదనను తెరపైకి తెచ్చారన్నారు. వివేకానందరెడ్డిని ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హత్య చేయించారంటూ కోర్టులో అభియోగం మోపడానికి అవినాష్‌రెడ్డి ఎవరని ప్రశ్నించారు. రూ. 2 కోట్ల ఆస్తి కోసం రూ. 40 కోట్లు ఇచ్చి హత్య చేయిస్తారా అని రఘురామ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news