ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష నేడు ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ భాషా మాట్లాడుతూ.. ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి జగన్ మూడు గంటల పాటు సమావేశం అయ్యారని తెలిపారు. ముఖ్యమంత్రి ఇంత సమయం కేటాయించటం సాధారణ విషయం కాదన్నారు అంజాద్ భాష. చట్ట సభల్లో ముస్లిం మైనారిటీలకు రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని కొనియాడారు.
చంద్రబాబు ఎప్పుడూ మైనారిటీకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు అంజాద్ భాష. మా గురువులు కొన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారని.. అన్ని అంశాలను ముఖ్యమంత్రి జగన్ నిశితంగా విన్నారని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే సీఎంఓ అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారని వివరించారు. మా మైనారిటీ వర్గాల తరపున ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలుపుతున్నానన్నారు అంజాద్ బాషా.