TSPSC కార్యాలయానికి SIT అధికారులు

-

TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. TSPSCకి చేరుకున్న ప్రత్యేక బృందం కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు ప్రవీణ్ క్యాబిన్లో తనిఖీ చేస్తున్నారు. ప్రధానంగా.. ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయనే కోణంలో సిట్ అధికారులు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అయితే.. టీఎస్సీఎస్సీ పేపర్‌ లీక్‌ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. ఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకేజీ కేసును సిట్‌ కు బ‌దిలీ చేశారు సీపీ సీవీ ఆనంద్‌. అద‌న‌పు సీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో ద‌ర్యాప్తు కొన‌సాగ‌నుంది. ఇప్ప‌టి వర‌కు ఈ కేసును బేగంబ‌జార్ పోలీసులు ద‌ర్యాప్తు చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్ ప్ర‌శ్నాప‌త్రం లీకేజీకి సంబంధించి నిందితుల‌పై 409, 420, 120(బీ) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

ఈ నెల 5వ తేదీన జ‌రిగిన అసిస్టెంట్ ఇంజినీర్ రాత‌ప‌రీక్ష ప్ర‌శ్నాప‌త్రం లీకైంద‌ని స‌మాచారం అందడంతో.. టీఎస్‌పీఎస్సీ అధికారులు అప్ర‌మ‌త్త‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 12న జ‌ర‌గాల్సిన టీపీబీవో, 15, 16 తేదీల్లో జ‌ర‌గాల్సిన వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల రాత‌ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. ఏఈ పేప‌ర్ లీక్ కేసులో టీఎస్‌పీఎస్సీలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొల‌గించారు. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్‌డీఏలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఢాక్య, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌తో పాటు మ‌రో న‌లుగురిని రిమాండ్‌కు త‌ర‌లించారు.

Read more RELATED
Recommended to you

Latest news