తెలంగాణలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని.. ఎమర్జెన్సీని కేసిఆర్ గారు తలపిస్తున్నారని ఫైర్ అయ్యారు విజయశాంతి. తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై విజయశాంతి స్పందించారు. తీన్మార్ మల్లన్నపై దాడులు, అరెస్టులు దుర్మార్గం అని నిప్పులు చెరిగారు విజయశాంతి.
సరే… ఇక ప్రజాస్వామ్య తెలంగాణను మీ నుండి కాపాడుకోవాల్సిన అవసరం తిరిగి మా ఉద్యమకారులకి వచ్చింది కావచ్చు అన్నారు. రేపటికి, మీ తప్పుడు అరెస్టులను వెనక్కు తీసుకోకుంటే, తెలంగాణ తన కష్టాల బిడ్డలకు, ఎప్పటికీ నేర్పిన తిరుగుబాటు మీరు కూడా చూస్తారని హెచ్చరించారు. తెలంగాణ కోసం కేసులు, జైళ్ళు, కొట్లాటలు, త్యాగాలు అన్నీ సహించిన ఉద్యమకారిణిగా నేను చెప్తున్న మాట ఇది కేసిఆర్ గారు…మీరు చేస్తున్నది అత్యంత దారుణం. ఆ బిడ్డలను విడిచిపెట్టండని పేర్కొన్నారు విజయశాంతి.